గ్రామాల్లో ఎంతో కాలంగా పరి
ష్కారంకాని రెవెన్యూసమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటుచేసిందని తహసీల్దార్ కె.సంజీవరావు తెలిపారు. బొద్దికూరపాడు గ్రామ సచివాలయం వద్ద సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ…. రికార్డుల్లో లేకుండా పాస్ పుస్తకాలు వుండటం, తప్పుల తడక రికార్డులు వుండం వంటి సమస్యల వల్ల భూహక్కుదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమవద్ద రికార్డుల జిరాక్సులతో అర్జీలు పెట్టుకుంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమవద్ద రికార్డుల జిరాక్సులతో అర్జీలు పెట్టుకుంటే రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి రెవెన్యూ సమస్యలను పరిష్కరించటం జరుగుతుందని తెలిపారు. సభలో బొద్దికూరపాడులో 37 ధరఖాస్తులు, శంకరనారాయణ పురం 3, సూరాయపాలెం 1 ధరఖాస్తు మొత్తం 41 ధరఖాస్తులు అందినట్లు తహ సీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందా శ్యాసంన్, ఉపసర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసరావు, పోలంరెడ్డి రమణారెడ్డి, విఆర్వో చెన్న కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శిఅల్లం వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు. వి వాదా స్పందంగా వున్న సర్వే నంబర్ 100 సలాన్ని తహసీలార్ పరిశీలించారు.
