పాఠశాల యాజమాన్య కమిటీలు పాఠశాల అభివృద్ధికి నిత్యం తోడ్పాటు అందిస్తూ సహకరించాలని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య కోరారు. స్థానిక వికే ఉన్నత పాఠశాలలో గురువారం ఎస్ఎంసీ చైర్మన్లకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య మాట్లాడుతూ ……గ్రామంలో ఉన్న బడి ఈడి పిల్లలు అందరూ బడిలో ఉండేలా చూడాలని కోరారు. దివ్యాంగత్వంతో అయిన ఇతర కారణాలతో ఎదైనా బడిలో లేకుండా ఉంటే, ఇతర గ్రామాలకు వలస వెళ్లి ఉంటే తగిన సూచనలు చేసి చదవు కొనసాగించాలని చెప్పారు. కమిటీలో రోజుకు ఒకరి చొప్పున భోజనాన్ని పరిశీలించటం, డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మరింత మెరుగుగా అందించేలా చూడటం, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొటం, వంట గ్యాస్, వంట గది నిర్మాణానికి సహకరించటంచ స్థానికంగా లభించే ఆకుకూరలు, పండ్లు పిల్లలకు అందించం, శుభ్రమైన మంచి నీరు సరఫరా అయ్యేలా చూడటం, పిల్లలకు అవగాహన పెంచేందుకు ప్రతి సందర్భంలో స్వచ్చ పాఠశాల గురించి వివరించటం, స్వచ్చంద సంస్థల సహాయం, సహాకారంతో మరింత అభివృద్ధి చెందింటం, ప్రత్యేక సందర్భాలతో ప్రముఖలచే విద్యార్థులకు ప్రశంశా పత్రాలు అందింటం వంటివి చేసేందుకు సహకరించాలని కోరారు.
ఎంఈఓ -2 సుధాకర రావు మాట్లాడుతూ పాఠశాలలకు తరచూ గైర్హజరు అయ్యే విధ్యార్థుల
తల్లిదండ్రులతో మాట్లాడి వారి హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో విద్యాసంవత్సరం చివరిలో తదుపరి తరగతి వెళ్లే విద్యార్థులకు కౌల్సిలింగ్ ఇచ్చి విద్యను కొనసాగించటం కోసం తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాల పర్యవేక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుధ్యం, వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మూత్ర శాలలు మరుగుదొడ్ల వాడకం, విద్యార్థుల వ్యక్తి గత శుభ్రతపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వికే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేష గిరి రావు, పలు పాఠశాలల హెచ్ఎం లు నాగ రాజు, నరసింహా రావు, 45 పాఠశాలల హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.

