ఆక్వా దుకాణాలను ప్రతి బుధవారం క్రమ తప్పకుండా తనిఖీ నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి (డీఎస్సీ ) చైర్మన్ రోణంకి గోపాల క్రిష్ణ కోరారు. ఆక్వా రైతులు వినియోగించే రసాయనాలు, యాంటీ బయాటిక్స్ నివారించే క్రమంలో మత్యశాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ ….తనిఖీలతో పాటు ప్రతి శనివారం ఆక్వా రైతులు వినియోగించే రసాయాలు, నిషేధిత యాంటీ బయాటిక్స్ వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి సూచనలు చెయ్యాలని కోరారు. తగిన జాగ్రత్తలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధించి క్రమబద్ధీకరించవలసినదిగా కమిటీ సభ్యులు ఆదేశించారు. జిల్లా మత్స్య శాఖాధికారి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి కమిటీ సభ్యుల విధులను కమిటి చైర్మన్కు వివరించారు.

