అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి బంగారు బాల్యం కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా అధ్యక్షతన బంగారు బాల్యంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్, స్కూల్ ఎడ్యుకేషన్ వారు సమన్వయంతో పనిచేసి డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని కోరారు. ప్రతి పాఠశాలలో నోడల్ అధికారిని నియమించి క్లబ్స్ను తయారు చేసి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్ సమయంలో ఐసీడీఎస్, హెల్త్ శాఖ సమన్వంతో పనిచెయ్యాలని చెప్పారు. అన్ని విభాగాల వారు పరస్పరం అవగాహనతో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్, ఐసీడీఎస్’ పీడి హెన సుజన్, డీఎం హెచ్ఐ టి వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ రవి కుమార్, డీపీఓ వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు

