షేడ్యూల్ కులముల వర్గీకరణ విషయమై ప్రత్యేక సిఫారస్ లు చేయుటకై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఎక సభ్య కమీషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈనెల 5, 6 తేదీలలో జిల్లాలో పర్యటిస్తారని తహసీల్దార్ సంజీవ రావు తెలిపారు. ఈనెల 6న ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రకాశం భవన్ లోని సమావేశపు మందిరంలో షేడ్యూల్ కులములకు సంబంధించి ఫిర్యాదులు. సలహాలు, సూచనలు స్వీకరిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సంబంధిత వర్గాల ప్రజలు, నాయకులు, సంఘ నాయకులు సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.
ఈనెల 6న షేడ్యూల్ కులముల వర్గీకరణ విషయమై ఫిర్యాదు స్వీకరణ
02
Jan