అనేక సార్లు గ్రామ రెవిన్యూ సభలు జరుపుతున్నారు వెళ్తూ న్నారు. కాని రైతులు సమస్యలు పరిష్కరించలేని రెవిన్యూ గ్రామ సభలు ఎందుకు అని రైతులు తహసీల్దార్ సంజీవ రావును అడిగారు. శివ రామపురం గ్రామంలో గురువారం రెవిన్యూ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంజీవ రావు మాట్లాడుతుండగా గతంలో రీ సర్వే జరిగిన సమయంలో దాదాపు 400 నంబర్ల లో విస్తీర్ణాలు తేడాలు రావటంతో రెవిన్యూ రికార్డులు తప్పులు తడకగా తయారు అయ్యాయని రైతులు సభ దృష్టికి తెచ్చారు. దీంతో బ్యాంకులలో అప్పులు పుట్టటం లేదని కనీసం రుణాలు సైతం రీ షేడ్యూల్ కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో ఇక్కడ పనిచేసిన గ్రామ సర్వేయర్ నిర్వాహకం వలననే ఈ తప్పులు జరిగాయని చెప్పారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంజీవ రావు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఒక కమిటీని వేసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీనివాస రావు, విఆర్డీఓ చంద్రశేఖర్ రావు, గ్రామ సర్వేయర్ శ్యామ్ , మాజీ ఎంపీటీసీ లక్ష్మి నారాయణ, తిరుపతి స్వామి, రామ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

