భారత దేశపు మొట్ట మొదటి తొలి ఉపాధ్యాయుని, ఆడ
పిల్లల కోసం మొదటగా పాఠశాలను స్థాపించటానికి జ్యోతి సావిత్రి భాయి పూలే కృషి కారణమని జిల్లా బాలల సంక్షేమ కమిటి చైర్ పర్సన్ వేము రామాంజనేయులు అన్నారు. పీవీ ఆర్ బాలికల హైస్కూల్ లో గురువారం ఆమె జయంతి సందర్భంగా పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆమె సేవలను కొనియాడారు. జిల్లా ప్రొబేషన్ అధికారి పి బాల ప్రభాకర్, పాఠశాల ఇన్చార్జి హెచ్ ఎం ఎ సుధా రాణి తదితరులు పాల్గొన్నారు.
