దర్శి లో జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం నేటి నుంచి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ డా గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు . ఈ సందర్భంగా డా లక్ష్మీ మాట్లాడుతూ..పరిపాలనాదక్షుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర అభివృద్ధి పట్ల పట్టుదల గలిగిన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పరిపాలన సారథ్యంలో ఈరోజు ప్రజల ప్రభుత్వం నడుస్తుంది. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యకు పెద్దపీట వేస్తూ.. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు సంచలనాత్మక సంస్కరణలు తెచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకూ నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాము. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ బాబు నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. సర్కార్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా నిత్యాన్నదాత, స్ఫూర్తిప్రదాత శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి ప్రారంభమైంది. దీని వల్ల 1,48,419 మంది విద్యార్థులకు ప్రభుత్వం భోజనం అందించనుంది. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 కాలేజీలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ వాటికి భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85 కోట్లు ఖర్చు చేయనున్నారు.
మన నియోజకవర్గంలో దర్శి, కురిచేడు, దొనకొండలోని జూనియర్ కళాశాలలో నేటినుండి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పథకాన్ని ప్రారంభోత్సవంలో నేను పాల్గొనడం నాకు చదువుకునే రోజులు గుర్తొస్తున్నాయి. చదువు అన్న విద్యార్థులు అన్న నాకెంతో ఇష్టం. రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు రోజూ ఉదయం 8 గంటలకు బయల్దేరి చాలా దూరం ప్రయాణించి కాలేజీలకి చేరుకుంటారు. కొన్నిసార్లు ఇంట్లో వీలు కుదరకపోవడం, వెంట తెచ్చుకున్న క్యారేజీ మధ్యాహ్నానికి పాడవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇలా ఒకటి, రెండు ప్రాంతాలు కాదు రాష్ట్రం మొత్తం మీద వివిధ జూనియర్ కళాశాలల్లో ఈ సమస్య ఉంది.
విద్యార్థులు ఉదయాన్నే బయలుదేరడం వల్ల కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వేరే పనులకు వెళ్లడం వల్ల సకాలంలో క్యారియర్ కట్టలేకపోతున్నారు. పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులది మరో సమస్య. వీరందరికి మధ్యాహ్న భోజనం అవసరం ఉంది. టీడీపీ ప్రభుత్వం 2019 వరకు అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వహయాంలో జగన్ సర్కార్ పక్కన పెట్టేసింది. దీంతో అర్ధాకలితో వారు విద్యాభ్యాసం చేసేవారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ దీనిని ప్రారంభించుకుంటున్నాము. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనుక, ఈ పథకాన్ని ప్రతీ ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదవాలి. బిడ్డల స్థాయి నుంచి వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, ఆనందం కోసం నిత్యం ఆలోచన చేస్తున్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మనమంతా ధన్యవాదాలు తెలియజేయాల్సిన ఆవశ్యకతను గుర్తిద్దాం. మేలు చేసే ప్రభుత్వానికి ప్రతీ ఒక్కరి మద్దతు మన బాధ్యత అని తెలుసుకుందామని..ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , దర్శి జూనియర్ కళాశా ప్రిన్సిపాల్ S. V. సుబ్బారావు , దర్శి హైస్కూల్ ప్రిన్సిపాల్ షేక్ ఖలీషా వలి , దర్శి మండల MEO రమాదేవి , అధ్యాపకులు, వైస్ చైర్మన్ గర్నిపూడి స్టివెన్, తదితరులు ఉన్నారు.

