మన దీక్ష – ఆలయాల రక్ష అంటూ దీక్షబూని ఆలయాల స్వయం ప్రతిపత్తికి, ఆలయాల్లో అన్యమతస్త ఉద్యొగులను తొలగించాలంటూ నినదిస్తూ ధార్మిక కేంద్రాలైన ఆలయ రక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వలన భక్తునికి భగవంతుని దూరం చేస్తున్న అనకొండలాంటి విష సర్పాన్ని తుదముట్టించడానికి విశ్వహిందూ పరిషత్ కేంద్ర ప్రముఖులు మరియు సాధు సంతుల పిలుపు మేరకు 5వ తేది ఆదివారం విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోని కేసరపల్లి లో ఏర్పాటు చేసిన హైందవ శంఖారావం భహిరంగ సభకు ఒంగోలు నుండి ప్రత్రేకముగా ఏర్పాటు చేసిన 23 బస్సుల ద్వారా మరియు ద్విచక్ర వాహనాలు, కార్ల పై రెండువేల మందికి పైగా హిందూ బంధువులు తరలి వెళ్లారు.
విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ మరియు హైందవ శంఖారావం కన్వీనర్ సోమా సుబ్బారావు మరియు వి.హెచ్.పి వివిధ విభాగ ప్రతినిధుల సమన్వయ నేతృత్వములో వివిధ కళాశాలలు ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా విజయవాడకు భారీగా పాల్గొన్నారు.
నగరంలోని పలు బస్తీలలో బస్ ప్రముఖుల నియంత్రణలో ఆదివారం ఉదయం 5 గంటలకు హిందూ బంధువులను ఒకదగ్గర చేర్చి విజయవాడ శంఖారావం సభకు తీసుకువెళ్ళారు
మామిడి పాలెం బస్తి లో బస్ ప్రముఖులు రాధ రమణ గుప్తా జంధ్యం, రెడ్డి మల్లిఖార్జున రావు మరియు ధనిశేట్టి రాము నాయుడు ల పర్యవేక్షణలో విజయవాడ వెళ్ళారు.
