సంస్కృతి సంప్రదాయాలకు కాపాడేందుకు ఎబీసీ హైస్కూల్ యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని మండల విద్యాశాఖాధికారి -2 సుధాకర్ రావు అన్నారు. ఎబీసీ హైస్కూల్ లో సంక్రాంతి సంబరాలలో బాగంగా సోమవారం ముగ్గుల పోటీలను ఎంఈఓ-2 ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీలలో పాల్గొని ముచ్చచగా ముగ్గులు వేసారు. పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, ప్రోత్సాహక బహుమతులను సంక్రాంతి సంబరాల సందర్భంగా అందజేస్తామని ఎబీసీ హైస్కూల్ యాజమాన్యం తెలిపారు.కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి , ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వర రావు , డైరెక్టర్ కాలేషాబాబులు పాల్గొన్నారు.












