రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ను, రాజ్యాంగాన్ని గౌరవించలేని ప్రభుత్వం పజాస్వామ్యానికి హానికరమని దర్శి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త కైపు వెంకట క్రిష్ణా రెడ్డి అన్నారు. తాళ్లూరులో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాం వద్ద కేంద్ర హోం మంత్రి అమిషాపై చర్య తీసుకోవాలని కోరుతూ అంబేడ్కర్ పాదాల చెంత తీర్మాణ పత్రం అందించారు. తాళ్లూరు సర్పంచి మేకల చార్లేస్ సర్జన్‌ను కలిసి తీర్మానాన్ని మండల సర్వసభ్య సమావేశంలో కూడ ప్రస్తావించాలని కోరారు. సర్పంచితో కలిసి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా క్షేత్రంలో ఎన్డీఏ పాలనపై ఆందోళన ఉదృతం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పౌ లేసు, ప్రభుదాస్, నిరీక్షణ కుమార్, నరేష్, ప్రసాద్, ప్రతాప్ రెడ్డి . జనార్ధన్, సెల్వం, ఐజాక్ బాబు, రాకేష్ తాళ్లూరు నాయకులు పాల్గొన్నారు.

