ప్రతి ఇంట సూర్య ఘర్ ముస్తీ బిజిలీ యోజన పథకంతో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని దర్శి డివిజన్ ఈ పి శ్రీనివాసులు పేర్కోన్నారు. తూర్పుగంగవరం మణి కంఠ యోగాలయంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దర్శి డివిజన్లో ఇప్పటికే 6729 మంది నమోదు చేసుకోగా58 పీఎం సూర్య ఘర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోగా వారికి 25 కనెక్షన్లకు రూ. 78 వేల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ రాయితీ వారి ఖాతాలలో జమ చేసినట్లు చెప్పారు. ఒక కిలో వాట్ రూ. 30వేలు, రెండు కిలో వాట్ లు రూ.60వేలు, మూడు కిలో వాట్లు ఆపైన రూ. 78 వేలు సబ్సిడీ రాయితీ వస్తుందని అన్నారు. ఐదేళ్లలో పెట్టిన పెట్టుబడి వస్తుందని 25 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చని తెలిపారు. మన ఇంటికి సరిపోయిన విద్యుత్ను వాడుకోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్ కు ఇవ్వటం ద్వారా ఆదాయం పొందవచ్చని చెప్పారు. దేశంలో మొత్తంలో మొదటి దశలో కోటి మందికి మాత్రమే రాయితీ వస్తుందని వినియోగదారులు త్వర పడాలని కోరారు. స్వంత ఇల్లు, విద్యుత్ కనెక్షన్ ఉన్న వారు సీఎం సూర్య ఘర్ వెబ్ సైట్లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని లేదా విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. విద్యుత్ ఎఈ వి. శ్రీనివాస రావు, యూనియన్ బ్యాంకు మెనేజర్ జాన్ పీటర్, ఎల్ఎఐ లు కాంతారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
