బంగారు బాల్యంలో బాగంగా చిన్నారులకు ఆధార్ కార్డులను తక్షణమే తీయించాలని సీడీపీఓ సిహెచ్ భారతి కోరారు. మండలంలోని వెలుగు వారి పాలెం, తూర్పుగంగవరం మన్నేపల్లి గ్రామాలలో ప్రత్యేకంగా జరుగుతున్న ఆధార్క్యాంపులను సీడిపీఓ సీహెచ్ భారతి, సూపర్వైజర్ జ్యోతి లు పరిశీలించారు. ఇప్పటి వరకు ఆయా క్యాంపులలో 86 మందికి ఆధార్ కార్డులు తీసినట్లు చెప్పారు. ఆయా గ్రామాలలోని అంగన్ వాడీ టీచర్లు, సిబ్బంది చిన్నారులను త్వరితగతిన ఆధార్ కార్డులు తీయించాలని కోరారు.
