సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బేగంపేట పోలీస్ ఇన్స్పెక్టర్ చిర్ర రామయ్య అన్నారు. శుక్రవారం బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫైబర్ క్రైమ్స్,డ్రగ్స్ , పోక్సో చట్టంపై ఇన్స్పెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రామయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఫోక్సోచట్టం , సైబర్ నేరాలు సెక్సువల్ అఫెన్స్ లు,డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు పై అవగాహన కల్పించారు.అనుమానస్పద నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని. అలాంటి ఫోన్లు ఎత్తవద్దని సూచించారు.విద్యార్థినులను వేధించిన వారిపైన కఠిన మైన కేసులు నమోదు చేస్తారని,హెచ్చరించారు.గంజాయి యువత పై తీవ్ర ప్రభావం చూపుతుందని.మత్తు కు బానిసలై తమ భవిష్యత్ ను అంధకారం చేసుకోవద్దని ఇన్స్పెక్టర్ సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు 250మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

