నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా క్విస్ ఫార్మసీ కళాశాలలోని విద్యార్థులకు రోడ్డు భద్రతపై శుక్రవారం అవగాహనా నిర్వహించారు. కళాశాల ఎన్ సీసీ విభాగం, జిల్లా నెహ్రూ యువకేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం ఆర్టీవో అమీర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాహనాలు నడిపేటప్పుడు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిపించారు. వాహనం నడిపే ప్రతి స్టూడెంట్ కి లైసెన్స్ ఉండాలని, హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. రవాణా శాఖ ఇచ్చే ప్రతి సూచనను పటిస్తే రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో క్విస్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిశోర్ బాబు, నెహ్రూ యువ కేంద్రం డిస్ట్రిక్ ఆఫీసర్ కమల్ షా, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సుశీల, ఒంగోలు ఆర్టీవో ఆఫీస్ సిబ్బంది, కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ధనమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
