తూర్పుగంగవరంలో నాగూర్ మీరావళి షరీఫ్ గంధం జెండా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లితత్ సాగర్లు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శి మున్సిపాలిటి చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, శాగం కొండా రెడ్డి, ముస్లీం నాయకులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న జెడ్పీటీసీ …
జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచిలు పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, వలి, కోఆప్షన్ కరిముల్లా పలువురు నాయకులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.

