నిత్యం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనవళ్లు, మనువరాలితో ఉల్లాసంగా గడిపారు. సంక్రాంతి సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కైట్ లను ఎగురవేసి సందడి చేశారు. తన కుమారుడు, రాష్ట్ర యువనాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్, మనవళ్లు మనవరాలుతో కలిసి కైట్ లు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
