సంస్కృతిని కాపాడుకునేందుకే ఈ రంగవల్లి కార్యక్రమాలు …. కార్పొరేటర్ చీర సుచిత్ర …….

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ఈ రంగవల్లి కార్యక్రమాలని ఇలాంటి కార్యక్రమాలను చేపట్టిన విశ్వకర్మ సంఘం వారికి అభినందనలని రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ సోమసందరం వీధిలోని విశ్వకర్మ సంఘ భవనంలో నిర్వహించిన రంగవల్లి సంక్రాంతి ముగ్గుల పోటీలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…. మహిళలలోని సృజనాత్మక శక్తిని వెలిగితీయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. అంతకుముందు సంఘ అధ్యక్షులు గోపాలపురం ప్రకాష్ మాట్లాడుతూ…. సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో సంఘీయుల అభివృద్ధికై అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు అందులో భాగంగా మహిళలను సంఘ కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని ఉద్దేశంతో ఈ రంగవల్లి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలను సాధించిన గట్టోజు జోష్ణ, పులిగిల్ల లక్ష్మీ, పద్మినీలకు కార్పొరేటర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మైలార్ గడ్డకు చెందిన అఖిల్ నందన్ ఆలపించిన శివస్తోత్రం ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గిర్మాపురం భాస్కరాచారి, కోశాధికారి బోనాల శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు కటకం చక్రపాణి, సంగం సాంఘిక శాఖ చైర్మన్ బౌరంపేట వీరాచారి ఇతర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దుబ్బాక కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. రాంగోపాల్ పేట్ డివిజన్ బిజెపి లీడర్లు జయ విజయలక్ష్మి నరేంద్ర పాల్ గోపి కిషన్ ఉపాధ్యాయ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *