నకిలీ నియామక పత్రాల పట్ల నిరుద్యోగ యువత అప్రమత్తం గా వ్యవహరించాలి…..— ఏ.కే.యూ రిజిస్ట్రార్ విజ్ఞప్తి.

నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి,యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్, కళాశాల విద్యా కమిషనర్ తదితరుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని పేర్కొంటూ పలువురు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ నియామక పత్రాలను సృష్టించి ఇటీవల కాలంలో నిరుద్యోగ యువతీ యువకులకు మాయ మాటలు చెప్పి, అమాయకులైన నిరుద్యోగులను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ విషయంలో నిరుద్యోగ యువతీ యువకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ రిజిస్ట్రార్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదని అన్నారు. నకిలీ నియామకాల నుండి నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. తమ దృష్టికి వచ్చిన నకిలీ నియామక పత్రాల వ్యవహారం పై తగు విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *