ప్రతి ఒక్కరికి లక్షర జ్ఞానం అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉల్లాస్ ( అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ఇన్ సొసైటీ ) ను విజయవంతం చెయ్యాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు కోరారు. స్థానిక వెలుగు కార్యాలయంలో శనివారం ఉల్లాస్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, జిల్లా కార్యనిర్వాహఖ కార్యదర్శి శాగం కొండా రెడ్డి, సొసైటీ చైర్మన్ సమర, నీటి సంఘం ఉపాధ్యక్షుడు శివ నాగి రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, చాట్ల డానీ, కోటేశ్వర రావు లు ముఖ్య అతిథిలు గా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఈఓ జి సుబ్బయ్య, ఎంపీపీ దేవరాజ్, ఎం ఎంఎస్ అధ్యక్షు రాలు సుజాత ఉల్లాస్ ప్రాముఖ్యతను వివరించారు.


