స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్ర ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి

స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు శనివారం తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రర్థ వహిస్తే మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపును పాటించాలని కోరారు. గడ్డ పార, చెలక పార పట్టి స్వచ్చ కార్మికులతో కలిసి పరిసరాల శుభ్రత పనులను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు ప్రారంభించారు.
కార్యక్రమంలో మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు శాగం కొండా రెడ్డి, మానం రమేష్ బాబు, కార్యదర్శి మేడగం వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ పెద కాలేషా వలి (బడే), నియోజక వర్గ అధ్యక్షుడు షేక్ మీరా మోహినుద్దీన్, తాళ్లూరు యువ నాయుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, డిస్ట్రిబ్యూషన్ కమిటి చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (సమర), కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, పాశం సూరిబాబు, పిన్నిక రమేష్, యువ నాయకుడు నవులూరు విద్యాసాగర్, సునుం ఆదినారాయణ రెడ్డి, పాలం అంజి రెడ్డి, వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డానీ, ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత , తాళ్లూరు గ్రామ కార్యదర్శి ఐ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
oplus_2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *