రైల్వే శాఖ చీఫ్ ఫార్మాసిస్ట్ నేత్రదానం.

హైదరాబాద్ జనవరి 26:
సికింద్రాబాద్ కు చెందిన శ్రీమతి పద్మారాణి (59) అనారోగ్యంతో ఆదివారం (26-01-25)నాడు మెట్టుగూడ సికింద్రాబాద్ లోని రైల్వే హాస్పిటల్ నందు మరణించారు. ఈమె రైల్వే శాఖ లో చీప్ ఫార్మా సిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈమె కవి, రచయిత, కార్టూనిస్ట్ గా ఉన్నారు. ఈమె మరణించిన విషయం తెలుసుకున్న అమ్మ నేత్ర,అవయవ,శరీర దాన ప్రోత్సాహకుల సంఘం వ్యవస్థాపకులు గంజి ఈశ్వరలింగం,పల్లవోలు రమణ లు కలిసి వాసన్ ఐ బ్యాంకు ద్వారా కార్నియాలను సేకరించారు. ఇందుకు సహకరించిన ఆమె భర్త రాంబాబు, కూతురు రమ్య లకు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానం కుటుంబ సాంప్రదాయం గా మార్చుకోవాలని, నేత్రదానం చేసి ఇద్దరు కార్నియా అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *