76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులతో ఘనంగా నిర్వహించిరు. ముఖ్య అతిధిగా శ్రీ గిరి గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం విచ్చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరావు మాట్లాడుతూ 1947 వ సంవత్సరంలో మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సొంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని, పటిష్టమైన చట్టాలను రూపొందించుకొని, దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపడానికి నాటి పాలకులు అంబేద్కర్ అధ్యక్షులుగ పలు దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మరింత పటిష్టమైన, ప్రజలకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని తెలిపారు. ఆ రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరం జనవరి 26న పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత అప్పటి నుండి జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవం గా జరుపుకోవడం జరుగుతుందని, ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా, మన రక్షణ పాటవం ప్రపంచానికి తెలిపే విధంగా, శకటాలను రూపొందించి ముఖ్య అతిధులుగా విచ్చేసిన విదేశీ పాలకుల సమక్షంలో ప్రపంచానికి తెలుపటం జరుగుతున్నదని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి, మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి, ఒంగోలు అసెంబ్లీ కో కన్వీనర్ ఐ. సీతారామయ్య, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆడిదం అనిల్, యువ మోర్చా ఉపాధ్యక్షులు సింగోతు రాజేషు వర్మ, జిల్లా అధికార ప్రతినిధి వి వెంకట్, కనిగిరి పట్టణ అధ్యక్షులు వి నారాయణ రెడ్డి, ఓబీసీ మర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, బిజెపి నాయకులు ఆచారి, జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు, నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని గణతంత్ర వేడుకలను జయప్రదం చేసిశారు.


