దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎరియా కోఆర్డినేటర్ తప్పెట డేవిడ్ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వెట్టి చాకిరి వ్యతిరేక నిర్మూలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిరోధించాలని మొబైల్ వ్యాన్ ద్వారా ప్లె కార్డులలో ప్రదర్శన నిర్వహించారు. ప్రాధమిక హక్కులకు భంగం కలుకకుండా ఉపాధి స్వేచ్చ, ప్రయాణించే హక్కు, కనీస వేతనం పొందే హక్కు, తమ వస్తువులను సేవలను మార్కెట్ విలువకు విక్రయించే హక్కుల పట్ల అవగాహన కల్పించారు. తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, ఎంపీడీఓ దార హనుమంత రావు, ఎంఈఓ జి సుబ్బయ్య, ఎ ఎస్సై మోహన రావు, సెక్రటరీ ఐవీ రమణా రెడ్డిలు పాల్గొన్నారు.
