వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల 48వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో లెక్చరర్లు సమిష్టిగా కృషి చేసి పూర్వవైభవం సాధించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని వక్తలు అన్నారు. వైఎస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పరుసుకొని సాధనకు కృషి చెయ్యాలని కోరారు. లెక్చరర్లు టి లక్ష్మయ్య, వై గురవయ్య, ఎస్ లలిత్ బోస్, డి పార్వతి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
