వనరుల సంరక్షణపై రైతులను, ప్రజలను చైతన్య పరచాలని డ్వామా పీడీ గంగవరపు జోసఫ్ కుమార్ అన్నారు. తాళ్లూరులోని శివరామపురంలో గురువారం ఇంకుడు కుంటల పనులను ప్రారంబించి డెమో నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎం ఎస్ఆర్ ఈజీఎస్ ఎఫ్ఎలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ జోసఫ్ కుమార్ మాట్లాడుతూ ఇంకుడు I గుంత వలన మురుగు నీటి సమస్య తీరటంతో పాటు భూ గర్భ జలాలు పెరుగుదల కూడ ఉండాయన్న విషయాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రతి ఇంకుడు గుంటకు రూ. .6వేల వరకు ఉపాధి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామంలో అవసరమైన అందరూ ఒకే సారి ఇంకుడు గుంతలు ప్రారంభిస్తే మెటిరీయల్ సరఫరా చెయ్యటానికి సులభంగా ఉండే విషయాన్ని చర్చిస్తున్నట్లు చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామాలలో ఉమ్మడిగా ఉండే మురికి గుంటలను గుర్తించి అందుకు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. ఈనెల 15న మండలంలోని ఏడు పంచాయితీలలో 146 ఇంకుడు గుంటల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు తమ పొలాలలో ఫామ్ ఫాండ్సు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అందుకు రైతులను గుర్తించి ఫామ్ ఫాండ్స్ ఏర్పాటు చేసుకునేటట్లు పీల్డ్ అసిస్టెంట్స్ ప్రొత్సహించాలని కోరారు. మనం చేసే ప్రతి పని సమాజానికి ఉపయోగపడేలా ఉండేలా చేస్తే రాబోవు తరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహించాలని కోరారు. పశువుల షేడ్స్ నిర్మాణం వేగవంతం అయ్యేలా చూడాలని అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి చోట మొక్కలను విరివిగా పెంచాలని సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉపాధి నిధులతో 40 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆయా మొక్కలను ప్రజా ప్రతినిథులు, కమ్యూనిటి మొబలైజెర్స్ సహకారంతో వీరి విగా నాటటానికి తగిన ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని సూచించారు.
డ్వామా పీడీని కలిసిన జెడ్పీటీసీ మారం ….
మండలానికి వచ్చిన డ్వామా పీడీ జోసఫ్ కుమార్ను జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి కలిసారు. మండలంలో జరుగుతున్న ఉపాధి పనులు, ఇతర అభివృద్ధి పనులపై చర్చించారు. రైతులను అవసరమైన పనులను ఉపాధి హామీలో చేపట్టాలని జెడ్పీటీసీ సూచించారు. కాలువలో పూడిక తీత పనులు బాగా జరుగుతున్నాయని జెడ్పీటీసీ పీడీ దృష్టికి తెచ్చారు.
ఎంపీడీఓ దార హనుమంత రావు, ఎస్ఏ సానికొమ్ము సత్యం తదితరులు పాల్గొన్నారు.

