ప్రజల సహకారంతో మెరుగైన సేవలు – దర్శి డీఎస్పీ బి లక్ష్మి నారాయణ

ప్రజల సహకారంతో మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతిక పెంచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు దర్శి డీఎస్పీ బి లక్ష్మినారాయణ తెలిపారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్ ను ఆయన వార్షిక తనిఖీలో బాగంగా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరధిలో ప్రతి గ్రామంలో నిఘా నేత్రాలు ( సీసీ కెమెరాలు) ఏర్పాటు చేసి నేరాలను నియంత్రణకు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చి చివరి నాటికి నిఘా కెమోరాల ఏర్పాటు పూర్తి అవుతుందని అన్నారు. ఎక్కడ చిన్న పాటి దొంగతనం లేదా ఇతర ఘర్షణలు జరిగినా ఇట్టే పరిగట్టె విధంగా పటిష్ట వ్యవస్థ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టేషన్ పరధిలోని అన్ని రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పూర్వా పరాలు తెలుసుకున్నారు. స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దిన ఎస్సై ను అభినందించారు. ఎస్ఐ మల్లిఖార్జున రావు, ఎఎస్సై మోహన రావు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *