దామోదరం సంజీవయ్య 105 వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కు నివాళులర్పించారు.
రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక ఉద్దండుడు దామోదరం సంజీవయ్య అని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంజీవయ్య చిత్రపటానికి జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్
మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ….దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14వ తేదీన కర్నూలు జిల్లా, కల్లూరు మండలంలోని పెద్దపాడులో జన్మించారని, దామోదరం సంజీవయ్య చదువులోనే గాకుండా సాహిత్య, సాంస్కృతిక రంగాలలోనూ రాణించారన్నారు. రాష్ట్ర మంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా సేవలు అందించారని కొనియాడారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వితంతువులు, వృద్ధులకు పింఛన్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అరికట్టడానికి, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఏ.సి.బి. వ్యవస్థని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ లో స్థాపించారన్నారు. నిజాయితీగా ప్రజలకు సేవలందిస్తూ ప్రజాహిత పాలన కోసం అనేక సంస్కరణలు అమలు చేశారని వివరించారు. ప్రజా సంక్షేమం అమలులో అందరి మన్ననలను పొందారన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రంలో గాజులదిన్నె, వరదరాజులు, పులిచింతల, వంశధార ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, వాటి నిర్మాణానికి దోహద పడ్డారని తెలిపారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ (ఎస్పీ అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏ.ఈ. ఎస్ డి.బాలయ్య, డీపీఓ ఏ. ఓ రామ్మోహన్, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.



