ముండ్లమూరు తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నాలుగు అర్జీలు వచ్చాయని తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ తెలిపారు. అందులో ఒకటి ఇంటి స్థలం సర్వే చేయాలని, మరో నాలుగు భూమిని ఆన్లైన్ చేయాలని అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఆర్ శ్రీకాంత్, ఆర్ ఐ పి వి ఎస్ ఆర్ మూర్తి, సీనియర్ అసిస్టెంట్ పోగుల శేషగిరిరావు, జూనియర్ అసిస్టెంట్ వాటుపల్లి కృష్ణ ప్రసాద్, వీఆర్వోలు. సిబ్బంది పాల్గొన్నారు.
