గవర్నర్ ప్రసంగంలో పసలేదని అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్, దర్శినియోజక వర్గ పార్టీ ఇన్చార్జి కైపు వెంకట క్రిష్ణా రెడ్డి అన్నారు. ప్రసంగంలో అన్ని అర్థ సత్యాలే అని ఆరోపించారు. సూపర్ సిక్స్పె స్పష్టమైన ప్రకటన లేదని అన్నారు. సంక్షేమం పునరుజ్జీవం అంటున్నారే కాని ఎప్పటి నుండే క్లారిటి లేదు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామేతలు చెప్పారని బాబు విజన్ 2047కు దమ్ము లేదని అన్నారు. 8 నెలల పాలన కాల యాపన తప్ప ఎక్కడా కమిట్ మెంట్ లేదని అన్నారు. హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశే మిగిలిందని అన్నారు. రూ.6,5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కడ వచ్చాయని అన్నారు. 4 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరికిచ్చారని . తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అసలు నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ బకాయిలకు చెల్లించలేదని, కొత్త సీసాలో పాత సారా అనే సామేత లెక్క కూటమి మ్యానిఫెస్టో నే గవర్నర్ చదివారు తప్పిస్తే కొత్త అంశాలు ఒక్కటీ లేవని విమర్శించారు.
