దోసకాయలపాడు పంచాయితీ తోట వెంగన్న పాలెంలో జలజీవన్ మిషన్ రూ. 48 లక్షలతో నిర్మిస్తున్న ట్యాంక్, పైప్ లైన్ పనులను ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఈ బాల శంకర రావు బుధవారం పరిశీలించారు. ఇప్పటికే4 కి.మీల మేర పైప్ లైన్ పనులు 187 నివాసాలను ఇంటింటికి ల్యాప్ ఇవ్వటం పూర్తి అయినది. అందులో బాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్ రూ.21 లక్షల వ్యయంతో నిర్మాణం కానున్న నేపధ్యంలో ఎస్ఈ బాల శంకర్ రావు, డీఈ రామ్ మోహన్ లు పరిశీలించారు. పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రాజెక్టు ఎప్రియల్ లోపు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచి కోట శివ లక్ష్మి, వెంకట రామి రెడ్డి, ఎఈ వాలి బాబు తదితరులు పాల్గొన్నారు.
