బేగంపేట్ ఇన్స్ పెక్టర్ గా బి .ప్రసాద్ రావు…….

బేగంపేట్ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా బి .ప్రసాద్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తించిన చిర్రామయ్యను రాష్ట్ర సచివాలయం సెక్యూరిటీ వింగుకు బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో 2007 బ్యాచ్ కి చెందిన బి. ప్రసాద్ రావు ను స్పెషల్ బ్రాంచ్ నుంచి బేగంపేటకు బదిలీ చేశారు. ప్రసాద్ రావు నగరంలోని అబిడ్స్, బంజారాహిల్స్ ట్రాఫిక్ విభాగాల్లో కూడా పనిచేశారు.
శాంతిభద్రతల కు తొలి ప్రాధాన్యం………
బేగంపేట్ ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. ప్రసాద్ రావు మాట్లాడుతూ బేగంపేట పరిధిలో శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అలాగే కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్ నిర్మూలనకు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి ,డ్రగ్స్ పై నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు. అల్లర్లకు పాల్పడే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని ప్రసాదరావు హెచ్చరించారు. కేసులు తక్షణ పరిష్కారానికి ఇరు వర్గాలతో చర్చించి శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామన్నారు .మద్యం దుకాణాలు, హోటల్స్ సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు ,రౌడీషీటర్ల పై నిఘా ఉంటుందని ఎక్కడైనా శాంత్ర భద్రతలకు విగాథం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *