బేగంపేట అల్లం తోట బాయి ప్రధాని రహదారి మధ్యలో గత కొన్ని దశాబ్దాల నుంచి ట్రాఫిక్ కు అంతరాయం గా ఉన్న భారీ వృక్షాన్ని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్రాజు ఇటీవల కాలంలో రోడ్డు మధ్యలో నుంచి తొలగించారు.సమీపంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నాటి వృక్షానికి జీవం పోశారు. ఈ సందర్భంగా అల్లం తోట బాయిలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయాయని చెట్టును తొలగించిన ట్రాఫిక్ ఏసిపి శంకర్ రాజును నగర కాంగ్రెస్ నాయకులు గౌరపల్లి రమేష్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం కలిసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పద్మా రెడ్డి, దర్గా కరుణాకర్ మాదిగ, సాంబయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు.
