మనసు పెట్టి ఏకాగ్రతతో చదివి పది పరీక్షలలో మంచి మార్కులు సాధించి ఉన్నత భవిష్యత్ రూపొందించుకోవాలని ఎబీసీ హైస్కూల్ ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రావు కోరారు. స్థానిక ఎబీసీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదవ తరగతి విద్యార్థులకు 9 వ తరగతి విద్యార్థులు ఫేర్ వెల్ ( వీడ్కోలు సభ) నిర్వహించారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సభను నిర్వహించారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ చదవు పట్ల ఆసక్తిని ఇష్టాన్ని పెంచుకుంటూ కృషి చేస్తే ఉన్నత స్థాయికి ఎదగ వచ్చని తెలిపారు. ఎబీసీ హైస్కూల్ కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎకాగ్రతతో చదివి మంచి మార్కులు పొందాలని కోరారు. నేర్చుకున్న విషయాలను నేర్పుగా సమర్థవంతంగా పరీక్షలలో ఎలా వ్రాయాలో వివరించారు. మనస్సు పనిచేసే తీరును మీలో మీరు మాట్లాడుకునే మాటలే.. మీ ఆలోచనలే మీ జీవితంగా రూపొందుతాయన్నారు. డైరెక్టర్ కె కాలేషా బాబు మాట్లాడుతూ సానుకూల దృక్పథంతో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుని మార్కులు ఎలా సాధించాలో వివరించారు. చదవు పట్ల ఆసక్తిని ఇష్టాన్ని పెంచుకుంటూ కృషి చేస్తే ఉన్నత స్థాయికి ఎదగ వచ్చని తెలిపారు. ఎస్ఏలు చిన్నయ్య, కొండల రావు, వెంకట రావు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.






