నిత్య అధ్యయనం ద్వారా
ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు తెలుసుకుంటూ మంచి వైద్యులుగా పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు వైద్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఒంగోలు నగరం లోని మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్య పూర్తి చేసుకున్న 2019 బ్యాచ్ వైద్యులకు శుక్రవారం గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించి పట్టాలు ప్రదానం చేశారు. నేటితో చదువు పూర్తయిందని అనుకోవద్దని, జీవితాంతం నేర్చుకుంటూనే విద్యా ర్థులుగా ఉండాలని సూచించారు. వైద్య రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ వైద్యరంగం రూపురేఖలే మారిపోతున్నాయని చెప్పారు. ఒంగోలు మెడికల్ కళాశాల నుంచి బయటకు వచ్చిన వైద్యులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారని చెప్పారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్ ప్రసంగిస్తూ దేశంలో 4 లక్షల మంది వైద్యులు ఉన్నారని, రాష్ట్రంలో ఐఎంఏకి 100 బ్రాంచ్లు ఉన్నాయ
ని, 25 వేల మంది వైద్యులు ఉన్నారని తెలిపారు. 20 లక్షల మంది నీట్ పరీక్షలు రాస్తే కేవలం 50 వేల నుంచి లక్ష మందే డాక్టర్ సీటు సంపాదించగలుగుతున్నారని తెలిపారు. ఎంతో శ్రమ తర్వాత వైద్యులై వస్తున్న కొత్త వైద్యులకు అభినందనలు తెలిపారు. డాక్టర్ అంటే కేవలం రోగం నయం చేసేవారే కాదని, మంచి సపోర్టర్ మసలే వారని చెప్పారు. వైద్య వృత్తి నిబద్ధత కలిగిన వైద్యులకు పూర్తిగా ఆత్మ సంతృప్తి ఇస్తుందన్నారు. జీజీహెచ్ ఇన్చార్జి సూపరిం టెండెంట్ డాక్టర్ కిరణ్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు సీతారామయ్య, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.



