తాళ్లూరు మండలంలోని రజానగరం, విఠలాపురం పంచాయితీల పరధిలో 24గంటల విద్యుత్ సరఫరా చేయుటకు ప్రత్యేక విద్యుత్ లైన్ లు ఏర్పాటు చేసారు. తాళ్లూరు సబ్ స్టేషన్ వద్ద అందుకు కావలసిన స్థంబాలను ఆదివారం ఏర్పాటు చేసారు. మరో రెండు మూడు రోజులలో పూర్తి లైన్స్ ఏర్పాటు చేసి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఇన్చార్జి ఎఈ శ్రీనివాస రావు తెలిపారు. తాళ్లూరు సబ్ స్టేషన్‌తో పాటు ఆదివారం ఆయా గ్రామాలలో విద్యుత్ లైన్స్ మరమ్మత్తులను చేపట్టారు.
