మేజర్లకు నీరు అందించి ఆదుకోండి సారూ ! – నిలువునా ఎండుతున్న వరి పైరు ఆరుతడి పంటలకు అందని ద్రాక్షే

దిగువ మేజర్లకు సాగర్ నీరు అందని ద్రాక్షగా మారింది. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు కోలుకోలేని దెబ్బ తగులుతున్నా సాగుపై ఆశ తో మళ్లీ సాగు ప్రారంభిస్తున్నప్పటికి అందుకు సాగు నీటి అధికారులు సైతం సహకరించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేజర్లకు పంటలు బాగా పొట్ట మీద ఉన్న సమయంలో నీరు అందక ఎండు ముఖం పట్టాయి. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన ఈ తరణంలో సాగర్ నీరు అందకుంటే మా పరిస్థితి ఎంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్దేశిత వాటా ప్రకారం నీరు రావటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కరువది మేజర్కు 280 క్యూసెక్కులు నీరు రావల్సి ఉండగా గత పది రోజుల నుండి నీరు వచ్చిన దాఖలాలు లేవు. రజానగరం మేజర్ కు సైతం 270 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా తక్కువ మేతాదులో వస్తున్నది. మేజర్ల చివరి ఆయుకట్టులో తాళ్లూరు మండలం పారుదల ఉన్నది. కనీసం ఆరుతడి పంటల కైనా నీరు అందుతుందను కుంటే అది కూడ నిరాశే ఎదురైనది. మండల పరధిలో 12వేల ఎకరాలు సాగు ఉన్నది. వరితో పాటు ఆరు తడి పంటలు కూడ మిర్చి, పొగాకు, ప్రత్తి మొక్కజొన్న సాగు చేసారు. సాగర్ నీరు సక్రమంగా రాక పోతుండటంతో రైతులు వ్యయ ప్రసాసలకు వోర్చి వాగులు, కుంటలలో ఉన్న కొద్ది పాటి నీటిని దూర ప్రాంతాల నుండి ఇంజన్ల ద్వారా తరలించి ఆరుతడి పంటలను కాపాడుకుంటున్నారు. అయితే పొట్టదశలో ఉన్న వరి మాత్రం నిలువునా ఎండు పోతుంటం చూసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిథులు, ప్రభుత్వ పెద్దల స్పందించి కరువది రజానగరం మేజర్లకు నీటికి అందించి రైతన్నను అదుకోవాలని కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రైతులను ఆదుకోవాలి – : మారం వెంకట రెడ్డి, రైతు, కొత్త పాలెం

కరువది మేజర్ లో వరి పొట్ట దశలో ఉన్నది. ఆరు తడి పంటలు సాగు చేసారు. అధికంగా పెట్టుబడులు పెట్టి పంటను కాపాడుకున్నాము. ఇప్పడు చేతికి అంది వచ్చే దశలో నీరు లేక పోతే తీవ్రంగా నష్టపోతాము. నమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నీరు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవటానికి రైతులం సమాయత్తం అవుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *