వేసవికాలం ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి మూడు నెలల పాటు ప్రతిరోజు ఒక్కొక్కరికి రెండు చొప్పున మజ్జిగ ప్యాకెట్లు అందజేయనున్నట్లు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు తెలియ జేశారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, ట్రాఫిక్ 1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ హెగ్డే శ్రీ నార్త్ డిస్ట్రిక్ట్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్, ల ఆదేశాల మేరకు నార్త్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, జి.శంకర్ రాజు పర్యవేక్షణలో ఉత్తరమండల పరిధిలో వున్న ప్రతి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బందికి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమంలో భాగంగా సిబ్బంది ఆరోగ్యం కాపాడే దృష్టితో సిబ్బంది అందరికీ వేసవి కాలం మూడు నెలల పాటు ప్రతిరోజూ 2 మజ్జిగ పాకెట్లని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా సిబ్బందికి మరింత సంక్షేమం అందించటానికి నగర సీనియర్ అధికారులు ముందుంటారని శంకర్ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి కార్యాలయం వద్ద ఏ సి పి సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్ల ను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

