విద్యార్థులు విద్యను అభ్యసించే పాఠశాలంటే ప్రతి ఒక్కరూ దేవాలయంగా భావిస్తారు. అలాంటి పాఠశాల ముందు గుర్తుతెలియని వ్యక్తులు చెత్త పడవేయడంతో పాఠశాల ప్రధాన ద్వారం ముందు రెండు వైపులా గుట్టగా చెత్త పేరుకుపోయింది. పాఠశాల ముందు ఉన్న బోరింగ్ కూడా ధ్వంసం అయింది. అసలే వేసవికాలం కావడం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ముందు చెత్త కొండగుట్టల్లా పేరుకుపోవడం పై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పాఠశాల ముందున్న స్థలాన్ని కూడా కొందరు కబ్జా చేస్తున్నారని సంబంధిత అధికారులు పాఠశాల ముందున్న ఆక్రమణలని తొలగించడంతోపాటు పాఠశాల ముందున్న చెత్త కుప్పలు తొలగించాలని, బోరును వినియోగంలోకి తీసుకురావాలని ,స్థానికులు, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు .మరోసారి పాఠశాల ముందు చెత్త వేయకుండా పటిష్టమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

