తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని నేతలను మూడు కేటగిరీలుగా విభజించాలన్న నిర్ణయాన్ని తాము కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నామని సీనియర్ నగర కాంగ్రెస్ నాయకులు గౌరపల్లి రమేష్ అన్నారు. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీలో ఉన్న వారిని ఒక గ్రూపు, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారు రెండో గ్రూపు, ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీలోకి వచ్చిన వారిని మూడో గ్రూపుగా విభజించామని మీనాక్షి నటరాజన్ పేర్కొనడాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ఆయనేతలకు ప్రాధాన్యత ఇస్తారని ఆమె అనడం సరైన చర్య అని రమేష్ పేర్కొన్నారు. పదవులు లేకున్నా, పార్టీ అధికారంలో లేకున్నా ,మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పలు అవమానాలు ఎదుర్కొని కేసులకు సైతం భయపడకుండా వెనుకడుగు వేయకుండా ఉన్ననాయకులు ,కార్యకర్తలను తాము అభినందిస్తున్నామన్నారు. మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
