సకల దేవతా స్వరూపంగా భావించే గోమాత సేవలో నిరంతరం తరిస్తున్న గో సేవికలు రాధా మరియు రమణలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం పేర్కొన్నారు.
స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్దగల శ్రీ బాపూజీ గోసంరక్షణ శాల (గోశాల) ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవమును పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ… భారతీయ సనాతన హిందూ సాంప్రదాయంలో మహిళా మూర్తులకు ఉన్నత స్థానం ఇచ్చి ప్రతిరోజు ప్రతిక్షణం వారిని గౌరవ భావంతో చూడటం, వారి ఆశీస్సులు పొందడం జరుగుతుందని మరియు సమస్త భూమండలాన్ని భూమాతగా, సకల దేవతా స్వరూపంగా పూజింపబడుతున్న గోవును గోమాతగా, నదులను నదీమ తల్లులుగా పూజిస్తున్న హిందువులుగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి ఆధ్వర్యములో మహిళా దినోత్సవాన్ని ఈ రోజు జరపడం అంతర్జాతీయ స్థాయిలో మార్చి 8వ తేదీని “మహిళా దినోత్సవము”గా వార్షికంగా జరపడం వలనే అని తెలిపారు.
కార్యక్రమంలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి సభ్యులు, శ్రీవారి భక్తులు గో సేవికలైన రాధా మరియు రమణలను సత్కరించారు. ఆలయ అర్చకులు ఇంగువ సుబ్రమణ్యం వేదాశీర్వచనం చేశారు.
కార్యక్రమంలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, ధనిశెట్టి రామునాయుడు, తుమ్మపూడి బుచ్చిబాబు, తుమ్మపూడి ఏడుకొండలు, సామి రాఘవేంద్రరావు మరియు ధనిశెట్టి పావని, బి. విజయరావు, తీగల సత్యవతి, రావూరి శివ, సుజాత తదితర శ్రీవారి భక్తులు పాల్గొన్నారు.

