Srinivasa Reddy:
మంచిసమాజ ఏర్పాటులో మహిళలే కీలకభాగస్వాములు-ఎంపీపీతాటికొండ
మంచి సమాజఏర్పాటులో మహిళలు కీలక భాగస్వాములని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాళ్లూరు లో ని స్త్రీశక్తిభవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలుశనివారం ఘనంగా జరిగాయి. ఈ సంద ర్భంగా ఎంఎంఎస్ అధ్యక్షురాలు ఎం. సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ తాటికొండ మాట్లాడుతూ….. ప్రభుత్వం మహిళలకు సంక్షేమ పథకాల ద్వారా చేయూత నిస్తున్నందున మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారన్నారు. దేశప్రధాని నరేంద్రా మోదీ ఇటీవల ప్రవేశపెట్టిన పార్లమెంట్ బడ్జెట్లోకూడా మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. దర్శి టీడీపీఇంచార్జి డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి లక్ష లాదిరూపా యల ఆదాయానిచ్చే వైద్య వృత్తిని వదులుకుని ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో రాజకీయ రంగప్రవేశం చేసి మహిళైనప్పటికి నిత్యంప్రజలకు అందుబాటులో వుంటున్నారని, ఆమెనుమహిళలుఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
జడ్పీటీసీ మారంవెంకటరెడ్డి మాట్లాడుతూ ….నిత్యం కుటుంబ ఉన్నతి మహిళలు కష్ట పడుతున్నారని, మహిళల కృషి వెలకట్టలేనిదన్నారు. ప్రతి మహిళా తల్లి తమ పిల్లలు చెడు మార్గంలో పయనించకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ సమాజాభివృద్ధిలో తాముబాగస్వాములు కావాలన్నారు. ఎంఈవో జి.సుబ్బయ్య మాట్లా డుతూ…. మహిళలవివక్షతను విడనాడి పురుషులతో పాటు అన్నిరంగాల్లో రాణిస్తూ తమకుటుంబాన్ని సమాజాన్ని మంచి మార్గంలో పయనించేలా చూడాలన్నారు. ఈసందర్భంగా పొదుపు మహిళలకు నిర్వహించిన వివిధరకాల పోటీల్లోని విజేత లకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. తురకపాలెం బాలికలు నృత్యప్రదర్శన చేశారు. ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. తురకపాలెం బాలికలు నృత్యప్రదర్శన చేశారు. ఈసందర్భంగామాధవరం వివోఅధ్యక్షురాలు, మహిళ, గోరంట్ల అంజమ్మను ప్రత్యేకంగా సత్కరించారు. మహిళాదినోత్సవాన్ని పురష్కరించుకుని మండల సమాఖ్యఅధ్యక్షురాలు ఎం.సుజాత, మాజీ అధ్యక్షురాలు జి. భాగ్యలక్ష్మి, అకౌంటెంట్ కుమార్, స్వీపర్ అంజమ్మలను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈకా ర్యక్రమంలో జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి, కరువది డీసీసీ ఉపాధ్యక్షులు శివనాగిరెడ్డి, టీడీపీ నేతలు శాగంకొండారెడ్డి, ఐ.శ్రీనివాసరె డ్డి, రాచకొండవెంకట్రావు, జి. లక్ష్మినారాయణ, ఎంఈవో జి.సుబ్బయ్య, వెలుగుఏపీఎం పి.దేవరాజ్, సీసీలు మోహన్రావు, సుచింద్ర, పి.శ్రీకాంత్ రెడ్డి, వివోలు, వివోఏలు పాల్గొ న్నారు.




