కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మహిళా దినోత్సవ వేడుకలలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్…………

కంటోన్మెంట్ మార్చి 9( జే ఎస్ డి ఎం న్యూస్)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని లోకయానస్థనక్ స్వచ్ఛంద సంస్థ కంటోన్మెంట్ సఖి నిలయంలో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరయ్యారు.ఈ మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సృష్టికి మూలం మహిళామణులే
కేవలం మహిళా దినోత్సవం నాడే కాకుండా ప్రతి నిత్యం మహిళలను గౌరవించుకోవాలని, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని…
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని…మహిళలు అభివృద్ధి చెందాలంటే విద్య, ఉద్యోగ,వ్యాపార రంగాల్లో వారిని మరింతగా ప్రోత్సహించాలని…
దీనిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను వ్యాపారులు గా తీర్చి దిద్దాలని సంకల్పించారని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న క్యాంటిన్ లను మహిళా సంఘాలకే కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు.
మహిళా సంఘాల ద్వారానే బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అద్దెకు ఇప్పించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా మహిళా సంఘాలకే వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.
శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సులను లాంఛనంగా ప్రారంభించారు . మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్లులను ప్రారంభించి ఐ కే పీ కేంద్రాల ద్వారా కోనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యం గా మార్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు కూడా మహిళా సంఘాల ద్వారానే సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని….
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల ఏర్పాటుకు కూడా మహిళా సోదరీమణులకు శిక్షణ ఇప్పించి వారి చేతనే పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉందని తెలిపారు.కంటోన్మెంట్ నియోజకవర్గం లోని మహిళా సోదరీమణులు ఎవరైనా పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనుకుంటే వారికి నేనే స్వంత ఖర్చులతో రవాణా సదుపాయం ఏర్పాటు చేసి ప్రభుత్వ శిక్షణా కేంద్రాలలో శిక్షణ ఇప్పిస్తానన్నారు.
కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ఈ సదవకాశాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ తోడ్పాటును మహిళా సోదరీమణులు సద్వినియోగం చేసుకుని కోటీశ్వరులు గా ఎదగాలని ఎమ్మెల్యేగా నా ఆకాంక్ష అన్నారు.
మహిళా దినోత్సవ వేడుకలలో లోకయానస్థనక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తులసి, కార్తీక్, బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్, స్థానిక నాయకులు వినోద్,ఉత్తరయ్య, శంకర్, సంతోష్ యాదవ్,షణ్ముగం,విద్దు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *