పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ సోమవరప్పాడు పరధిలోని గుంటి గంగా సన్నిధిలో గల గుంటి గంగా భవానీ తల్లి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గుంటి గంగమ్మ తల్లి కి పొంగళ్లు పెట్టి చల్లంగా కరుణించమని వేడు కున్నారు. తాళ్లూరు పరిసర మండల గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ బ్రహ్మణ అర్చకులు ఎన్ కామేశ్వర శర్మ పూజారులు ప్రకాశం పంతులు, విజయలక్ష్మి, బాల రాజు అమ్మ వారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వాసు, ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
