జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్

  • పెండింగ్ కేసులను హేతుబద్దంగా విశ్లేషించి వాటి దర్యాప్తు త్వరితగతిన పూర్తీ చేయాలి -దొంగతనాల కట్టడితో పాటు చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలి -డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి చట్ట వ్యతిరేక/అసాంఘీక కార్యక్రమాల అడ్డుకట్ట వెయ్యాలి – పెండింగ్ NBWs ను ప్రత్యేక టీంతో త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలి -విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారాలను మరియు సిబ్బంది అభినందించిన జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్

జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో బుధవారం ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో నేరసమీక్షా సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ ఏ. ఆర్ దామోదర్
ముఖ్యంగా గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, మిస్సింగ్, హత్య కేసులు, సాధారణ మరణాలు,పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్, ఎన్ఫోర్స్మెంట్ మరియు ఇతర కేసులతో పాటు డిపిఓలో వివిధ పెండింగ్ రిప్లయ్స్ సమీక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కరించాలని, ప్రాపర్టీ నేరాల కట్టడి, నిందితులు గుర్తింపు, రికవరీకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగ సొత్తు రికవరీ చేయాలని, అనుమానితుల వ్యక్తులను ఫింగర్ ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ద్వారా ఫింగర్ ప్రింట్ సేకరించి తనిఖీ చేయాలన్నారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి భాదితులకు న్యాయం చేకుర్చాలి. పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేక మరియు అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా (డ్రోన్ కెమెరాలతో) పెట్టి కట్టడి చేయాలని సూచించారు.

జిల్లాలో గుర్తుతెలియని మృతదేహాలు, కారణం తెలియని మరణం కేసులు, అనుమానాస్పద మృతి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని,
ఆయా కేసుల్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించాలని, ఆర్ఎఫ్ఎస్ఎల్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులను త్వరితగతిన తెప్పించుకుని పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే NBW వారెంట్స్ పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు.

పోలీస్ అధికారులు అందరూ తమ తమ పరిధిలో ఉన్న గ్రామాలను సందర్శించి అక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్య ఎదురుకాకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తరచూ నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అలాంటి ప్రాంతాలలో పోలీసు అధికారులు విసిబుల్ పోలీసింగ్ ను పెంచి ముందస్తుగానే నేరాలను నియంత్రించాలి.
PGRS ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు.

అదేవిధంగా స్కూల్ లు మరియు కాలేజీలో సెల్ఫ్ టెక్నానిక్స్ పై అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయాలని, ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శక్తి టీం ఏర్పాటు చేయాలని మరియు శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. శక్తి కాల్స్ పై వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు.

కెమెరాలు/డ్రోన్ ల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేసి ఏర్పాటు చేసే విధంగా చూడాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ పొలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని, మహిళలు/చిన్నారుల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పదించాలని, పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు.

ముండ్లమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమపాడు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తుల వద్ద నాలుగు కేజీల గంజాయి గుర్తించి వారిని అరెస్టు మరియు 72 ట్రాన్స్ఫారం దొంగతనం కేసులోని ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన దర్శి సీఐ వై రామారావు, ముండ్లమూరు ఎస్సై నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ మహేష్, మరియబాబు, కిరణ మహేష్, హోంగార్డులు ఖాసీం, ఖాసి రాజు లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.

ఈ నేర సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, నాగరాజు, SB ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, DCRB సీఐ దేవ ప్రభాకర్, ఐటి కోర్ సీఐ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *