నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్

ప్రకాశం జిల్లా పరిధిలో లా & ఆర్డర్, నేరాలు & ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ మరియు ఇతర పోలీసింగ్ అవసరాల కొరకు ఒంగోలు చెందిన ఒక్కంటి నవీన్ రుద్ర, బిందు హేచరీ,ఈతముక్కల అనే వ్యక్తి మరియు అర్ధవీడు కు చెందిన సీడ్ ఆర్గనైజర్స్ అసోసియేషన్ సభ్యులు SK.జిలాని మరియు గెలిమిరెడ్డి తిరుపతి రెడ్డి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ కి అత్యాధునిక సాంకేతికత కూడిన DJI Air3s డ్రోన్ కెమెరాలను అందచేసినారు. జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో పోలీస్ శాఖకు ఒక డ్రోన్‌ లను బహుకరించడం అభినందనీయమన్నారు. డ్రోన్ లను కొత్తపట్నం మరియు అర్ధవీడు పోలీస్ స్టేషన్ లకు జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ అందచేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్
మాట్లాడుతూ….. డ్రోన్ టెక్నాలజీని వినియోగించి, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు, ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో చైన్‌ స్నాచింగ్స్‌, ఈవ్‌ టీజింగు, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ఏరియాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు/నిశిత ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్‌ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విఐపిల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుందని, ముఖ్య కూడళ్ళలో ట్రాఫిక్‌ నియంత్రణ, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు
డ్రోన్స్‌ వినియోగిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, కంభం సీఐ మల్లికార్జున రావు, కొత్తపట్నం ఎస్సై సుధాకర్, అర్ధవీడు ఎస్సై సుదర్శన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *