మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈనెల 14వ తేదీ(శుక్రవారం)న నిర్వహించవలసిన కార్యక్రమాన్ని హోలీ పండుగ సందర్భంగా మార్చి 18 కి వాయిదా వేసినట్లు స్టేట్ మోడల్ అధికారి దివ్య తెలియజేశారు. దరఖాసుదారులు ఈ మార్పును గమనించి ఈనెల 14 శుక్రవారం కాకుండా ఈనెల 18 మంగళవారం రోజున ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని స్టేట్ మోడల్ అధికారి తెలియజేశారు.
