మోండా మార్కెట్ మార్చి 14(జే ఎస్ డీ ఎం న్యూస్) :
చిన్న, పెద్ద తేడా లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ హోళీ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మోండా డివిజన్ బండి మెట్ లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నాగులు ఆధ్వర్యంలో నిర్వహించిన హోళీ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోళీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నాగులు, సత్యనారాయణ, శ్రీనాథ్, వెంకట్, అమర్ తదితరులు పాల్గొన్నారు.
