యూపీఐ జమలపై అవగాహన పెంచుకోవాలి ఎపీజీబి మెనేజర్ మహేష్ రెడ్డి

డిజిటల్, యూపీఐ పేమెంట్స్ పై అవగాహన పెంచుకోవాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మెనేజర్ మహేష్ రెడ్డి కోరారు. తూర్పు గంగవరం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం యూపీఐ పెమెంట్స్ అవగాహనపై ప్రత్యేక అవగాహన నిర్వహించారు. ఖాతాదారుల వద్దకు వెళ్లి యూపీఐ పేమెంట్స్పై అవగాహన కల్పించారు. బ్యాంకు ఖాతా ఉన్న వారికి యూపీఐ యాప్లను యాక్టివ్ చేసారు. 200 మందికి అవగాహన కల్పించి 120 మంది వరకు యాక్టివ్ చేసారు. తూర్పుగంగవరంలో శ్రీ అంబికా ఫ్యాషన్స్లో కరెంట్ ఖాతా, యూపీఐ గురించి తెలిపి కస్లమర్లకు యూపీఐ వలన కలిగే ప్రయోజనాలు వివరించాలని మెనేజర్ మహేష్ రెడ్డి కోరారు. బ్యాంకు కరస్పాండెంట్ (బీసీ) క్రిష్ణా రెడ్డి, బ్యాంకు సిబ్బంది నరసింహా తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *