ఘనంగా బీహార్ దివాస్

బేగంపేట మార్చి 23(జేఎస్ డి ఎం న్యూస్) : బీహార్ ఫౌండేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో బీహార్ దివాస్ ను ఆదివారం పీపుల్స్ ప్లాజా వేదికగా ఘనంగా నిర్వహించారు. బాండింగ్, బ్రాండింగ్, బిజినెస్ నినాదంతో బిహారీలు ఈ వేడుకలను నిర్వహించారు. వారి సంస్కృతి, వ్యాపారం, ప్రతిభను ప్రోత్సహించి బిహార్ రాష్ట్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బిహార్ వలస వాదులు హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిహార్ ప్రత్యేకతను తెలియజేసే స్టాల్స్ ఏర్పాటుచేశారు. స్టాల్స్లో ఆహారం, దుస్తులు, కళలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిహారి కళాకారులైన మంత్ర ట్రూప్ సంగీత ప్రదర్శన, ప్రముఖ గాయక బృందం తివారి బ్రదర్స్ బిహారి పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి కార్యనిర్వాహణ కమిటి అధ్యక్షులు మునీంద్రలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ ప్రణబ్ స్వాగతోపన్యాసం చేయగా, ఉత్తమ్ యాదవ్ నివేదిక సరమర్పించారు. బిహార్ అసోసియేషన్ అధ్యక్షులు హరేరాం సింగ్, మన్వేంద్ర మిశ్రా, ధశరథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఉన్న ప్రముఖ బిహారీలను సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *